మ‌హేష్ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ ఆ రోజేనా?

  • IndiaGlitz, [Wednesday,December 06 2017]

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న సినిమా 'భరత్ అనే నేను' (ప్ర‌చారంలో ఉన్న పేరు). ఇందులో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు కొరటాల.. తన గత సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే వచ్చారు.

గతంలో మ‌హేష్‌, కొర‌టాల కాంబోలో వచ్చిన 'శ్రీమంతుడు'లో కూడా ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ని చెప్పారు. ఈ కార‌ణంగా.. ఈ సినిమా కోసం మ‌హేష్ అభిమానులు మ‌రింత‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మధ్య కొరటాల తన ట్విట్టర్ అకౌంటులో ఎడ్యుకేషన్ సిస్టం గురించి ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ని నిజం చేస్తూ ఈ సినిమాలో కూడా ఎడ్యుకేషన్ సిస్టం పై తన దృష్టిని సారించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. త్వరలో ఆఖ‌రి షెడ్యూల్ కోసం చిత్ర బృందం కారైకుడి (తమిళనాడు) వెళ్ల‌నుంది. అక్కడ డిసెంబర్ 25 వరకు ఆఖరి షెడ్యూలుని చిత్రీకరిస్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 31 రాత్రి విడుదల చేయబోతున్నారని తెలిసింది. అయితే దీనిపై అధికారిక స‌మాచారం రాలేదు.

డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ న‌టిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 27, 2018న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

More News

విక్రమ్-సమంతల '10' డిసెంబర్ 15న విడుదల

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం '10 ఎండ్రాతుకుల్ల'. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని '10' పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిసĺ

'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్ ప్రారంభం

అటు అభిమానులు..ఇటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' బుధ‌వారం అధికారికంగా సెట్స్ కు వెళ్లింది.

మ‌ల‌యాళ రీమేక్‌లో క‌ళ్యాణ్ రామ్‌

నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. ప్ర‌స్తుతం ఎం.ఎల్.ఎ. సినిమాలో నటిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని రూపొందిస్తున్న చిత్రం ఇది. గతంలో 'ఆగడు', 'బ్రూస్ లీ' వంటి చిత్రాలకు ఉపేంద్ర ర‌చ‌యిత‌గా పనిచేసారు.

రిపబ్లిక్ డే రోజు '2.O' టీజర్!

సూపర్ స్టార్ రజనీ కాంత్, ఏస్‌ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా '2.O'. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. ప్రస్తుతం   పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

నిజాయితీతో చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు - స‌ప్త‌గిరి

క‌మెడియిన్ సప్త‌గిరి హీరోగా న‌టిచిన చిత్రం 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి'. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌పై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.