వంశీకి ముద్దుపెట్టిన మహేశ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, పూజా హెగ్దే నటీనటులుగా తెరకెక్కించిన చిత్రం 'మహర్షి' మే-09న విడుదలై సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. కాగా ముందుగా అందరూ ఊహించినట్టుగానే సక్సెస్ అవ్వడంతో చిత్రబృందం ముఖ్యంగా మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఇప్పటికే సక్సెస్ మీట్ పూర్తి చేసుకున్న చిత్రబృందం తాజాగా.. మహేశ్ ఇంట్లో సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా.. తనకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి ఆనందంతో బుగ్గ పై ముద్దిచ్చారు మహేశ్. దీంతో వంశీ హ్యాపీగా ఫీలయ్యాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది..!
ఇదిలా ఉంటే.. మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా.. వంశీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను డైరెక్టర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. దీనికి "ఇదే నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఇంతకంటే ఇంకేం అడగగలను" అని క్యాప్షన్ పెట్టారు.
ఈ ఫొటోతో పాటు వంశీ, ఆయన కుమార్తె, సితార, మహేశ్ ఉన్న మరో ఫొటోను షేర్ చేసి ఇదీ లైఫ్ అంటే.. అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ ట్వీట్‌కు మహేశ్ అభిమానులు, సినీ ప్రియులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు 'వీకెండ్ వ్యవసాయం' కాన్సెప్ట్‌ను మెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నట్లు ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com