మహేష్, కమల్ హాసన్ పాన్ ఇండియా మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే ?
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి ప్రభంజనం తర్వాత సౌత్ లో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలయింది. పదుల సంఖ్యలో పాన్ ఇండియా చిత్రాలకు ప్రకటనలు వస్తున్నాయి. సినీ అభిమానులని ఆశ్చర్యంలో ముంచెత్తే ఓ వార్త తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: చిరంజీవి సోదరిగా బాలయ్య హీరోయిన్?
సూపర్ స్టార్ మహెష్ బాబు, లోకనాయకుడు కమల్ హాసన్ లతో పాన్ ఇండియా మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ ఇప్పటికే ఇద్దరు హీరోలతో చర్చలు ప్రారంభించాడని వినికిడి. ఇద్దరు హీరోలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారట.
మహేష్ బాబు ఆసక్తికరంగా ఈ చిత్రంలో సిబిఐ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. మిడిల్ ఏజ్డ్ వ్యక్తిగా కమల్ కనిపిస్తాడట. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించనుందని అంటున్నారు. బాలీవుడ్ లో ఓ నిర్మాణ సంస్థతో పాన్ ఇండియా చిత్రానికి మురుగదాస్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నాడట. బహుశా ఆ చిత్రం ఇదే కావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా మహేష్ బాబుతో మురుగదాస్ ఇదివరకే స్పైడర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన సంగతి తెసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com