హ్యాపీగా ఉందంటున్న బుర్రిపాలెం బుల్లోడు..!
Send us your feedback to audioarticles@vaarta.com
హ్యాపీగా ఉందంటున్న బుర్రిపాలెం బుల్లోడు ఎవరో కాదు ప్రిన్స్ మహేష్ బాబు..! సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రిపాలెం. అందుకనే కృష్ణకు సినిమాలో ఏమాత్రం అవకాశం ఉన్నా బుర్రిపాలెంలో షూటింగ్ చేసేవారు. ప్రజారాజ్యం, పచ్చని సంసారం,బుర్రిపాలెం బుల్లోడు తదితర చిత్రాలను బుర్రిపాలెంలోనే షూటింగ్ చేసారు. కృష్ణ నట వారసుడు మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నారు.
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆంధ్రహాస్పటల్స్ బుర్రిపాలెంలో చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ & డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 177 చిల్డ్రన్స్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు తన ఫేస్ బుక్ ద్వారా తెలియచేస్తూ...ఈ చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ & డ్రాయింగ్ కాంపిటేషన్ ఫోటోలను పోస్ట్ చేసారు. బుర్రిపాలెంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పై సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రహాస్పటల్ కు థ్యాంక్స్ తెలియచేసాడు బుర్రిపాలెం బుల్లోడు..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments