గ‌ల్లా ఇంట్లో మ‌హేష్‌

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

శ్రీమంతుడు స‌క్సెస్‌లో ఉన్నారు మ‌హేష్‌. ఆ సినిమా విడుద‌లై స‌క్సెస్ అయిన త‌ర్వాత కొన్నాళ్ళ పాటు థాయ్‌ల్యాండ్‌కు వెళ్లొచ్చారు. త్వ‌ర‌లో బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు. శుక్ర‌వారం గ‌ల్లా జ‌య‌దేవ్ ఇంటికి వెళ్లారు. మ‌హేష్ బావ, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఇటీవ‌ల బైక్ యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డ్డారు.

ఆయ‌న్ని ప‌రామ‌ర్శించేందుకు మ‌హేష్ త‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త‌తో క‌లిసి గ‌ల్లా జ‌య‌దేవ్ ఇంటికి వెళ్లారు. అక్క‌డ కాసేపు గ‌ల్లా కుటుంబంతో ముచ్చ‌టించారు. అనంత‌రం గ‌ల్లా కుటుంబ‌స‌భ్యుల‌తో ఫోటోలు తీసుకుని ఇంటికెళ్లారు. ఇప్పుడు తాను కాస్త న‌డ‌వ‌గ‌లుగుతున్నాన‌ని చెప్పుకొచ్చారు గ‌ల్లా జ‌య‌దేవ్‌.