అతిథి పాత్ర‌లో మ‌హేష్ ..?

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు కేవ‌లం సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డంతో పాటు బిజినెస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఒక‌వైపు ఏషియ‌న్ సంస్థ‌తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్‌ల‌ను నిర్మిస్తున్నారు. మ‌రో వైపు త‌న స్వంత నిర్మాణ సంస్థ ఎం.బి ఎంట‌ర్‌టైన్మెంట్స్ పై చిన్న చిత్రాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.

కొత్త న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ఈ సినిమాల‌తో ప‌రిచ‌యం చేస్తూ లో బ‌డ్జెట్‌లో సినిమాలు చేయబోతున్నారు. కాగా అందులో తొలి ప్ర‌య‌త్నంగా ఓ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో మ‌హేశ్ గెస్ట్‌రోల్‌లో న‌టిస్తాడ‌నే వార్త‌లు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే..