జ‌ర్మనీలో మహేశ్‌...

  • IndiaGlitz, [Friday,October 12 2018]

సూప‌ర్‌స్టార్ మహేశ్ త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి నుండి కాస్త గ్యాప్ దొర‌క‌డంతో ఫ్యామిలీతో క‌లిసి జ‌ర్మ‌నీ ట్రిప్‌కి వెళ్లారు. శ్రీమ‌తి న‌మ్ర‌త‌, గౌత‌మ్‌, సితార‌ల‌తో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్న మ‌హేశ్ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఈ వెకేష‌న్ త‌ర్వాత మ‌హ‌ర్షికి సంబంధించిన ఫైన‌ల్ షెడ్యూల్‌లో మ‌హేష్ పొల్గొన‌బోతున్నాడు. న‌వంబ‌ర్ 10వ‌రకు ఈ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. దాంతో టాకీపార్ట్ పూర్త‌వుతుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్‌, దిల్‌రాజు, పివిపి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌.