మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్, క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందనుందనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ మూవీని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ క్రేజీ మూవీలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది.అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ మూవీలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను ఫైనల్ చేసారట. ఈ మూవీ కోసం శ్రుతి హాసన్ ను అడిగిన వెంటనే ఓకె చెప్పిందట. ఇదే కనుక నిజమైతే..శ్రీమంతుడు తో ఆకట్టుకున్న మహేష్, శ్రుతి హాసన్ జంట మరో్సారి ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com