మహేష్ హీరోయిన్ మొత్తానికి హిట్ కొట్టింది
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రమే సూపర్‌స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించే అవకాశం పొందింది కృతి సనన్. మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కృతికి ఆ చిత్రం (1 - నేనొక్కడినే) పేరు తీసుకువచ్చినా.. విజయాన్నైతే ఇవ్వలేకపోయింది. ఆ తరువాత వచ్చిన దోచేయ్ కూడా డిజాస్టర్ కావడంతో తెలుగు తెరపై మళ్లీ కనిపించనేలేదు కృతి. అయితే బాలీవుడ్లో మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతోందీ అమ్మడు.
పరుగుకి రీమేక్ గా వచ్చిన హీరోపంతి ఫరవాలేదనిపించుకుంటే.. షారుఖ్ ఖాన్ కి మరదలిగా, వరుణ్ ధావన్‌కి జోడీగా నటించిన దిల్ వాలే డిజాస్టర్ అయింది. ఈ మధ్యనే వచ్చిన రబ్తాది కూడా ఇదే పరిస్థితి. మగధీరకి కాపీ వెర్షన్‌గా వచ్చిన రబ్తా విషయంలో కృతి కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది.
కట్ చేస్తే.. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా హిందీ చిత్రం బరేయిల్లీ కి బర్ఫీ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా బిట్టి మిశ్రా పాత్రలో కృతి ఒదిగిపోయిదంటూ ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి కృతి సనన్ ఎదురుచూస్తున్న విజయం దక్కిందనే చెప్పుకోవచ్చు. కంగ్రాట్స్ కృతి!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com