మహేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను' బాక్సాఫీస్ వద్ద విజయం వైపు పరుగులు తీస్తోంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ కావడమే కాకుండా పలువురి ప్రశంసలను అందుకుంటోంది.
ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్ ప్రారంభం నుంచి గమనిస్తే.. ఓ సెంటిమెంట్ అతడిని ఎక్కువగా వెంటాడుతోంది. అదేమిటంటే.. రెండు ఫ్లాపుల తర్వాత హిట్‌ను అందుకోవడం మహేశ్‌కు ఆనవాయితీగా మారింది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే.. 'రాజకుమారుడు'తో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ప్రిన్స్.
ఆ తర్వాత 'యువరాజు', 'వంశీ' ఫ్లాపుల తర్వాత 'మురారి'తో విజయాన్ని అందుకున్నారు మహేశ్. మళ్ళీ 'టక్కరి దొంగ', 'బాబీ' లాంటి పరాజయాల తర్వాత 'ఒక్కడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మరోసారి ఫామ్‌లోకి వచ్చారు. మధ్యలో పరాజయాలు పలకరించినా అతడు, పోకిరితో సూపర్ స్టార్ అయిపోయారు.
అలాగే 'దూకుడు'తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాక.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరువాత '1:నేనొక్కడినే', 'ఆగడు' రూపంలో పరాజయాలు పలకరించినా.. 'శ్రీమంతుడు'తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.మళ్ళీ 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనా.. తాజాగా 'భరత్ అనే నేను'తో మరోసారి విజయాల బాట పట్టారు సూపర్ స్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout