మ‌హేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్‌

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'  బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయం వైపు పరుగులు తీస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స‌క్సెస్ కావ‌డ‌మే కాకుండా పలువురి ప్రశంసలను అందుకుంటోంది.

ఇదిలా ఉంటే.. మ‌హేష్ కెరీర్ ప్రారంభం నుంచి గ‌మ‌నిస్తే.. ఓ సెంటిమెంట్ అత‌డిని ఎక్కువ‌గా వెంటాడుతోంది. అదేమిటంటే.. రెండు ఫ్లాపుల తర్వాత హిట్‌ను అందుకోవడం మహేశ్‌కు ఆనవాయితీగా మారింది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే.. 'రాజకుమారుడు'తో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ప్రిన్స్.

ఆ తర్వాత 'యువరాజు', 'వంశీ' ఫ్లాపుల తర్వాత 'మురారి'తో విజయాన్ని అందుకున్నారు మహేశ్. మళ్ళీ 'టక్కరి దొంగ', 'బాబీ' లాంటి పరాజయాల తర్వాత 'ఒక్కడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మ‌రోసారి ఫామ్‌లోకి వ‌చ్చారు. మ‌ధ్య‌లో ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా అత‌డు, పోకిరితో సూప‌ర్ స్టార్ అయిపోయారు.

అలాగే 'దూకుడు'తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చాక.. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' త‌రువాత‌ '1:నేనొక్కడినే', 'ఆగడు' రూపంలో పరాజయాలు పలకరించినా.. 'శ్రీమంతుడు'తో మ‌రో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.మ‌ళ్ళీ 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనా.. తాజాగా 'భరత్ అనే నేను'తో మ‌రోసారి విజయాల‌ బాట ప‌ట్టారు సూపర్ స్టార్. 

More News

గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

తొలిసారి సంక్రాంతి బరిలో బోయపాటి ఫిల్మ్

తెలుగులో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన‌ దర్శకుల‌లో బోయపాటి శ్రీను ఒక‌రు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై

య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ కొత్త డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా య‌న్‌.టి.ఆర్ పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

మూడో గేర్ లో డ్రైవర్ రాముడు

శకలక శంకర్... తాను తెర మీద కనపడగానే థియేటర్ మొత్తం నవుళ్ళతో నిండిపోతుంది. ఇలా  నవ్వులతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు.

కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన మంచు లక్ష్మి 'వైఫ్ ఆఫ్ రామ్' టీజర్

ఇన్నోవేటివ్  థాట్స్ ను ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టైల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు.