Guntur Karaam: యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న 'గుంటూరు కారం' ట్రైలర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

  • IndiaGlitz, [Monday,January 08 2024]

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం'(Guntur Kaaram)చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. నిన్న రాత్రి విడుదలైన ఈ ట్రైలర్ కొద్ది గంటల్లోనే ఏకంగా 22 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇందులో మహేశ్ లుక్, డైలాగ్స్ విపరీతంగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మహేశ్ తల్లిగా రమ్యకృష్ణ, తండ్రిగా జయరామ్, విలన్‌గా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే... మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారు అని అంటున్నారు అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గుంటూరు యాసలో మహేశ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. అంతేకాకుండా కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్ అన్ని కలగలపి ట్రైలర్ ఉంది. శ్రీలీల, మహేశ్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. లుంగీ కట్టుకుని, బీడీ తాగుతూ మహేశ్.. స్వాగ్.. వేరే లెవెల్ అంతే అని చెప్పొచ్చు.

గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలుకకు తగిలింది అనుకో.. కళ్లలోంచి వచ్చేది నీళ్లే .. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ.. ఇప్పుడు పిలిపించి.. ఇస్త్రీ చీర వేసుకుని మరీ కొడుతుంది అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సంగీత దర్శకుడు తమన్ అందించిన బీజీఎం కూడా నెక్ట్ లెవెల్‌లో ఉంది. మొత్తానికి ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించింది. దీంతో మూవీపై మరింత హైప్ పెరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా ‘గుంటూరు కారం’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగనుందో అధికార ప్రకటన వచ్చేసింది. గుంటూరు మిర్చియార్డ్ నేపథ్యంలో జరిగే మూవీ కావడంతో.. అందుకు తగ్గట్లు గుంటూరులోనే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రేపు(మంగళవారం) సాయంత్రం 5 గంటల తర్వాత గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటించింది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.

 

 

More News

Education in AP: సీఎం వైయస్ జగన్ సంస్కరణల ఫలితం.. దేశంలోనే ఏపీ ఫస్ట్..

ఏ రాష్ట్రంలోనైనా పేదరికం పోవాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతోంది. విద్యారంగం బాగుంటే ఆ రాష్ట్ర భవిష్యత్ కూడా కళకళలాడుతుంది.

Jr NTR Fans: జూ.ఎన్టీఆర్ అభిమానులపై లోకేష్ సైన్యం దాడి.. సర్వత్రా ఆగ్రహావేశాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన రా.. కదలిరా సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర అవమానం జరిగింది. తారక్ ఫొటోతో ఉన్న జెండాలను ఆయన అభిమానులు ప్రదర్శించారు.

PM Modi:అంతరిక్షంలో ఆదిత్య ఎల్-1' ప్రయోగం సక్సెస్.. ప్ర‌ధాని మోదీ హర్షం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO)మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సూర్యుడి రహస్యానాలను అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపి ఆదిత్య ఎల్‌-1(Aidtya L1)

Anganwadi workers:అంగన్‌వాడీ వర్కర్లపై 'ఎస్మా' అస్త్రం సంధించిన ప్రభుత్వం

తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

Kesineni Nani: పొమ్మనలేక పొగబెట్టారా..? కేశినేని నానికి చంద్రబాబు చెక్..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అసలు స్వరూపం బయటపడుతోంది. ఇప్పటిదాకా పార్టీ మనుగడ కోసం నాటకాలు ఆడిన చంద్రబాబు అసలు విశ్వరూపం ఇప్పుడు బయపటపడింది.