Guntur Kaaram Making: 'గుంటూరు కారం' మేకింగ్ వీడియో.. మహేష్ ఎనర్జీ మామూలుగా లేదుగా..

  • IndiaGlitz, [Thursday,January 11 2024]

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం మరికొన్ని గంటల్లోనే రానుంది. ఇవాళ అర్థరాత్రి ఒంటి గంట నుంచే 'గుంటూరు కారం' మూవీ బెనిఫిట్ షోలు పడనున్నాయి. దీంతో మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు మూవీ యూనిట్ కూడా అభిమానులను వరుసగా సర్‌ప్రైజ్ చేస్తోంది. బుధవారం మావా ఎంతైనా పాటను సెలైంట్‌గా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఫైటింగ్ సీన్స్‌ చిత్రీకరణలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించారు. ఇక డ్యాన్స్ అయితే ఇరగదీశాడు. ఇందులో మహేష్‌ ఎనర్జీని చూస్తుంటే థియేటర్ల దద్దరిల్లాల్సిందే అన్నట్లు ఉంది. ఈసారి మాస్ జాతర మామూలుగా ఉండదనిపిస్తోంది.

ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మహేష్ బాబు సొంత జిల్లా గుంటూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం మహేష్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌ నింపింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి మా సినిమాలు బ్లాక్‌బాస్టర్ అయ్యాయి. ఈసారి కూడా గట్టిగా కొడుతున్నాం. అయితే ఈసారి నాన్న లేని లోటు మాత్రం ఉంది. ఇక నుంచి అభిమానులే నాకు అమ్మ, నాన్న.. ఏదైనా ఇక మీరే అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్ ఈ మాటలను షేర్ చేస్తూ లవ్ యూ అన్న' అంటూ స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్‌ తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ, తండ్రిగా జయరామ్, విలన్‌గా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్, పాటలు, మేకింగ్ వీడియో చూస్తుంటే అభిమానులకు విందు భోజనంలా మూవీ ఉండనుందని అర్థమవుతోంది. మహేష్ చెప్పినట్లుగా ఈసారి సంక్రాంతి పండుగకు కూడా గట్టిగా కొట్టేలా ఉన్నారు. మరి మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో.. ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

More News

MLC By-Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం

Vikram Goud: టీబీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక..!

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేత దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Mohith Reddy: దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ పట్టలేదు.. చంద్రబాబు ఆరోపణలపై మోహిత్ రెడ్డి ఫైర్..

చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్పించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నిరూపిస్తే నామినేషన్‌ కూడా వేయనని తుడా చైర్మన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి

Kesineni Nani: కేశినేని నానిపై టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్.. వైసీపీ కోవర్టు అంటూ ఆరోపణలు..

టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం చంద్రబాబు

Traffic Challans: తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు..

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల గడువును ఈనెల 31వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.