నాని ఆడియోకి అతిథిగా మహేష్..
Saturday, January 16, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ సాధించిన యువ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ నెల 20న క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ ఆడియోను ఘనంగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
ఇక అసలు విషయానికి వస్తే...ఈ ఆడియో వేడుకకు సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో ఆడియో తో పాటు థియేటర్ ట్రైలర్ మహేష్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి... అందాల రాక్షసి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయిన హను రాఘవపూడి క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ తో అయినా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments