మహేశ్ గ్రీన్ సిగ్నల్.. చైతు సినిమా వాయిదా!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ 27వ సినిమా స్టార్ట్ కానే లేదు కానీ..చాలా మలుపులను తీసుకుంటోంది. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు వంశీ పైడిపల్లితో మహేశ్ 27 రూపొందుతుందని అందరూ అనుకున్నారు కానీ.. చివరకు కథ నచ్చకపోవడంతో మహేశ్ నో చెప్పేశాడు. మరో డైరెక్టర్‌ని వెతికే పనిలో పడ్డారు. ఈ మధ్యలోనే చిరంజీవి 152వ చిత్రంలో మహేశ్ కీలక పాత్రలో నటించడానికి రెడీ అయిపోయాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ 27వ సినిమాను పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఇదంతా బాగానే ఉంది. మహేశ్ అవకాశం ఇవ్వడంతో పరుశురామ్ కూడా రెడీ అయిపోయాడు. అయితే పరుశురామ్ అప్పటికే నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. విషయం తెలిసిన మహేశ్, పరుశురామ్‌తో తాను చిరు 152 చేసే లోపు చైతన్యతో సినిమా చేయమని చెప్పాడట. అయితే అందుకు సమయం పడుతుందని కాబట్టి దాన్ని హోల్డ్ పెట్టానని, తానే వెయిట్ చేస్తానని మహేశ్‌కి చెప్పాడట పరుశురామ్. ఇప్పుడు చిరు 152 సినిమాను మహేశ్ పూర్తి చేసిన తర్వాత పరుశురామ్ వెయిట్ చేస్తాడట. ఏదైతేనేం మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైతన్య సినిమా వాయిదా పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com