మహేశ్ గ్రీన్ సిగ్న‌ల్‌.. చైతు సినిమా వాయిదా!

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమా స్టార్ట్ కానే లేదు కానీ..చాలా మ‌లుపుల‌ను తీసుకుంటోంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు వంశీ పైడిప‌ల్లితో మ‌హేశ్ 27 రూపొందుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ.. చివ‌ర‌కు క‌థ న‌చ్చక‌పోవ‌డంతో మ‌హేశ్ నో చెప్పేశాడు. మ‌రో డైరెక్ట‌ర్‌ని వెతికే ప‌నిలో ప‌డ్డారు. ఈ మ‌ధ్య‌లోనే చిరంజీవి 152వ చిత్రంలో మ‌హేశ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి రెడీ అయిపోయాడు. ఇది పూర్తి కాగానే మ‌హేశ్ 27వ సినిమాను ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు.

ఇదంతా బాగానే ఉంది. మ‌హేశ్ అవ‌కాశం ఇవ్వ‌డంతో ప‌రుశురామ్ కూడా రెడీ అయిపోయాడు. అయితే ప‌రుశురామ్ అప్ప‌టికే నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. విష‌యం తెలిసిన మ‌హేశ్‌, ప‌రుశురామ్‌తో తాను చిరు 152 చేసే లోపు చైత‌న్య‌తో సినిమా చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. అయితే అందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని కాబ‌ట్టి దాన్ని హోల్డ్ పెట్టాన‌ని, తానే వెయిట్ చేస్తాన‌ని మ‌హేశ్‌కి చెప్పాడ‌ట ప‌రుశురామ్‌. ఇప్పుడు చిరు 152 సినిమాను మ‌హేశ్ పూర్తి చేసిన త‌ర్వాత ప‌రుశురామ్ వెయిట్ చేస్తాడ‌ట‌. ఏదైతేనేం మ‌హేశ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో చైత‌న్య సినిమా వాయిదా ప‌డింది.

More News

అనుష్క పెళ్లిపై మ‌రో వార్త‌..నిజ‌మెంత‌?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరున్న అనుష్క శెట్టి పెళ్లిపై రొజుకొక వార్త విన‌ప‌డుతుంది. కొన్ని రోజుల క్రితం అనుష్క ఓ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ను పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు వినిపించాయి.

మార్చి13న ‘ప్రేమపిపాసి’ రిలీజ్‌

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌  బ్యానర్స్‌ పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’

నాగీ సినిమాకు ప్రభాస్ 70 కోట్ల పారితోషికం!?

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘రాములో రాములా...’ !

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’

కరోనా వైరస్ నేపథ్యంలో నాగబాబు సరికొత్త వ్యాఖ్యలు

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.