ఆ హీరోయిన్ కి మరోసారి అవకాశం ఇచ్చిన మహేష్..!
Monday, December 5, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత మహేష్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండింటిలో ఫస్ట్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో ఓ మూవీ చేయనున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన కాజల్ నటించనున్నట్టు సమాచారం. మహేష్ - కాజల్ కలిసి బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించారు. మూడోసారి వంశీ పైడిపల్లితో చేయనున్న చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments