టీమ్‌కి మ‌హేశ్ బ‌హుమతి

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోచేసిన సినిమా 'భ‌ర‌త్ అనే నేను'. మ‌హేశ్ ఇందులో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌న‌ప‌డుతుండ‌టం ఒక కార‌ణం... 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత మ‌హేశ్‌, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వస్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఏప్రిల్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా ఫ‌లితంపై మ‌హేశ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సినిమా అవుట్‌పుట్ బాగా రావ‌డానికి కార‌ణ‌మైన డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లోని స‌భ్యుల‌కు ఐఫోన్ ఎక్స్‌ను ప్రెజంట్ చేశాడ‌ట మహేశ్‌. ఇంత‌కు ముందు శ్రీమంతుడు హిట్ అయిన త‌ర్వాత కొరటాల శివ ఖరీదైన కారును మ‌హేశ్ గిఫ్ట్‌గా ఇచ్చారు.