మహేష్ కు కోర్టు ఆదేశం...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. గ్రామాలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడు వివాదం నెలకొంది. శ్రీమంతుడు కథ తనదేనంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి నాంపల్లి కోర్టను ఆశ్రయించాడు. 2012 సంవత్సరం లో స్వాతి మాసపత్రిక లో చచ్చేంత ప్రేమ అనే నవల ను శ్రీమంతుడు చిత్రం గా మలచారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపి నాంపల్లి కోర్ట్ సెక్షన్ కాపీ రైట్స్ యాక్ట్ 63 కుట్ర పూరిత నేరం భారతీయ శిక్షా స్మృతి 120 బి కింద కేసు నమోదు చేయాలంటూ వాదనలు జరిగాయి. వాదనలు విన్న జడ్జి నిర్మాతలైన ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కు మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్‌కు చిత్ర దర్శకుడు కొరటాల శివ లను మార్చి 3 వ తేదీన ఈ సభ్యులందరు నాంపల్లి కోర్ట్ హాజరు కావాలని,ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout