'స్టార్‌' ను చేసిన డైరెక్టర్‌నే మరిచిన మహేశ్ బాబు!

  • IndiaGlitz, [Thursday,May 02 2019]

ప్రిన్స్ మహేశ్ బాబు‌‌ను ‘స్టార్’ను చేసిన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ విషయం ఎవర్ని అడిగినా చెబుతారు.. అంతేకాదు మహేశ్ బాబు అభిమానుల నోటి నుంచి మొదట వచ్చే మాట ఇది. అప్పటి వరకు ప్రిన్స్ మహేశ్ బాబుగా ఉన్న ఆయన పేరు సూపర్‌స్టార్ మహేశ్‌గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.!. అయితే అలా తనను స్టార్‌ను చేసిన డైరెక్టర్ పూరీని ఆయన మరిచిపోయే సరికి అందరూ ఒకింత అవాక్కయ్యారు!.

టర్నింగ్ ఇచ్చినోళ్లు వాళ్లే కానీ..!

మహేశ్ తన 25వ చిత్రం ‘మహర్షి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మహర్షి’ చిత్రం డైరెక్టర్ వంశీపైడిపల్లి మొదలుకుని పలువురు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నిషియన్స్ అందరూ మాట్లాడారు. ఇంతలో మహేశ్ వంతు రానే వచ్చింది.. నా లైఫ్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే ‘దూకుడు’ సినిమాయే. ఆ సినిమా చేసిన శ్రీనువైట్ల గారికి థాంక్స్‌. ‘శ్రీమంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాల‌తో రెండు సార్లు లైఫ్ ఇచ్చిన కొర‌టాల గారికి థాంక్స్‌. ఆయ‌న‌కు ఎప్పటికీ రుణ‌ప‌డి ఉంటాను. ఈ 25వ సినిమా వంశీ పైడిప‌ల్లి గురించి చెప్పాలంటే నేను ఎవ‌రినీ పేరు పెట్టి పిల‌వ‌లేదు. వంశీనే అలా పిలుస్తాను. అందుకు కార‌ణం అత‌న్ని నా త‌మ్ముడిగా భావిస్తున్నాను అని మహేశ్ చెప్పుకొచ్చారు. ఇంత వరకూ బాగుంది మహేశ్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా మహేశ్‌ను ఈ రేంజ్‌కి తెచ్చి సూపర్‌స్టార్ అనిపించిన వారిలో త్రివిక్రమ్, శ్రీనువైట్ల, కొరటాల శివ ఉన్నారు.

పూరీనే మరిస్తే ఎలా మహేశ్!!

అయితే.. ఈ సినిమాలన్నింటి కంటే ముందు మహేశ్‌ను ఎవరెస్ట్‌ అంత ఎత్తున నిలబెట్టిన చిత్రం ‘పోకిరి’. ఈ సినిమాకు తెరకెక్కించింది పూరీ జగన్నాథ్. ‘పోకిరి’ ముందు వరకు మహేశ్ రేంజ్ వేరు.. ‘పోకిరి’ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యిన తర్వాత మహేశ్ రేంజ్ వేరు.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే. బహుశా అప్పట్నుంచే ఆయన ప్రిన్స్ పేరు కాస్త ‘సూపర్ స్టార్’గా మారిపోయింది. అయితే తనను ఈ రేంజ్‌కు తీసుకొచ్చిన పూరీని మహేశ్ మరిచిపోయారు!. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరి పేర్లు చెప్పిన మహేశ్.. పూరీ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. అలా మహేశ్ మాట్లాడుతుండగానే అభిమానులంతా బాబు.. వీరందరికంటే పూరీ ముందున్నారు.. ‘పూరీని మరిచిపోయార్ సార్’.. ‘సార్ సార్ ‘పోకిరీ’ని మరిచిపోయారు’ అంటూ కేకలేశారు. మరికొందరు అభిమానులు ‘పోకిరి.. పోకిరి’ అంటూ గట్టిగా అరిచేశారు. అయితే ఈ కేకలు మహేశ్ దాకా చేరుకోలేదు.!. మహేశ్ మాటలకు అక్కడున్న అభిమానులు, సభికులు ఒకింత కంగుతిన్నారు.

అదేంటి మహేశ్.. పూరీని మరిచిపోవడమా..? పూరీ పేరులేని మహేశ్ ప్రసంగమా..? అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి మహేశ్ తన ప్రతీ ఈవెంట్‌లో దాదాపు తనకు లైఫ్ ఇచ్చిన.. తనను ప్రస్తుతం ఈ రేంజ్‌లో నిలబెట్టిన ప్రతీ డైరెక్టర్‌ను గుర్తు చేసుకుంటూ ఉంటారు.. అయితే ఈ ఈవెంట్‌లో మాత్రం మరిచిపోయారో.. లేదా కంగారులో ఇలా చేశారా..? అనేది ఆయనకే ఎరుక. పూరీ జగన్నాథ్.. ఒక్క మహేశ్‌‌కే కాదు ఎందరో హీరో, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన వారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో.

అంతేకాదు.. అప్పటికే రెండు సార్లు..!

మహేశ్ 25 సినిమాలకు సంబంధించి చిన్న చిన్న డైలాగ్స్, సాంగ్స్‌తో కలిపి ఓ సాంగ్‌ను స్టేజ్‌పై కొందరు డ్యాన్సర్స్‌ పెర్ఫామెన్స్ చేశారు. అందులో కూడా పోకిరి సినిమాలోని ‘ఎప్పుడొచ్చామా.. అన్నది కాదన్నయ్యా’ అనే డైలాగే ఉంది. దీంతోపాటు ఓ సాంగ్ కూడా ప్లే చేశారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు మహేశ్ సార్‌ డైలాగ్ అంటే చాలా ఇష్టం.. ఇది పాత డైలాగ్ అయినా నాకిష్టమే.. ఎప్పటికీ జనాలకు గుర్తుండిపోయేది అంటూ.. ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో.. ’ డైలాగ్‌ కూడా చెప్పాడు. ఇలా ఒకటి కాదు రెండుసార్లు పోకిరి సినిమాను గుర్తు చేసినప్పటికీ మహేశ్ మాత్రం తన ప్రసంగంలో ‘పోకిరి’ సినిమా ప్రస్తావన కూడా తీసుకురాలేదు.. దీంతో పూరీ అభిమానులే కాదు.. మహేశ్ అభిమానులే కూడా అసంతృప్తికి లోనయ్యారు. అయితే మరోవైపు మహేశ్ స్పీచ్‌‌లో పూరీని మరిచారు.. అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్స్ మొదలైంది. దీంతో తిన్నగా తేరుకున్న మహేశ్.. ‘నా లైఫ్‌లో టర్న్ ఇచ్చిన ‘పోకిరీ’.. పూరీ జగన్నాథ్ గారిని తన ప్రసంగంలో ప్రస్తావించడం మరిచాను’ అంటూ ఇంటికెళ్లిన తర్వాత మహేశ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో అభిమానులు కాసింత శాంతపడ్డారు.

More News

అనాధ పిల్లల కోసం అవెంజర్స్ స్పెషల్ షో వేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం అవెంజర్స్. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తాను మాత్రమే చూసి ఎంజాయ్ చేయకుండా...

ఇంతకీ ఆ శక్తులెవరు.. ఆర్జీవీ ఆగ్రహం!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ఎంత క్రేజ్ వచ్చిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.

ప్రధాని మోదీ వదిన కన్నుమూత

ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ చిన్న అన్నయ్య.. ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి (55) (మోదీ వదిన) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

'ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ బాబాయ్ ఇతనే..!

టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీలో ‘కోత’

ప్రభుత్వం బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. మే-01 నుంచి కొత్త వడ్డీ రేట్ల విధానం అమల్లోకి తెచ్చింది.