సూప‌ర్‌స్టార్‌ని ఫాలో అవుతున్న మహేశ్..!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ర‌జినీకాంత్‌కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. ప్ర‌తి ఏడాది ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఇప్పుడు ఆయ‌న రూట్‌లో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ హిమాల‌యాల‌కు వెళుతున్నాడా? అంటే అవుననే వార్త‌లు ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతుంది. ప్ర‌తి స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో స‌హా విదేశాల‌కు వెళ్లి వ‌చ్చే మ‌హేశ్‌.. ఈసారి హిమాల‌యాల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. భార్య న‌మ్ర‌త‌, పిల్ల‌ల‌తో క‌లిసి మ‌హేశ్ హిమాల‌యాల‌కు వెళ‌తాడా? లేక త‌నొక్క‌డే వెళ‌తాడా? అనే దానిపై క్లారిటీ రావ‌డం లేద‌ట‌.

ఈ ఏడాది ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’తో హిట్ కొట్టిన మ‌హేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 27వ సినిమాను స్టార్ట్ చేస్తాడని అనుకున్నారు. కానీ సినిమా వాయిదా పడటంతో ఆ స్థానంలో పరుశురామ్ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకు ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఆలోపు మ‌హేశ్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. డైరెక్ట‌ర్ కొర‌టాల తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో మ‌హేశ్ పోర్ష‌న్ చిత్రీక‌రించ‌డానికి ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో ఆలోపు హిమాల‌యాల‌కు ట్రిప్ వేయాల‌నేది మ‌హేశ్ ఆలోచ‌న‌గా తెలుస్తుంద‌ట‌.

More News

107పై ఫోక‌స్ పెడుతున్న బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఉగాది కానుకగా వ‌స్తోన్న‘ఒరేయ్‌ బుజ్జిగా...`మంచి విజ‌యం సాధించాలి - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

'అన్నపూర్ణ‌మ్మ గారి మనవడు' నాకు ప్ర‌త్యేకం - అన్నపూర్ణ‌మ్మ

చిత్రసీమలో నన్నంతా గౌరవంగా చూస్తారు  "అమ్మబాగున్నావా? అని నవ్వుతూ పలకరిస్తారు అమ్మా అన్నారంటే గౌరవం!

జగన్‌కు, ఏపీ ప్రజలకు థ్యాంక్స్.. మీకు సేవ చేస్తా!

ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానిని

‘ప్రేమపిపాసి’ సక్సెస్ పై  కాన్ఫిడెంట్ గా ఉన్నాం - చిత్ర నిర్మాత  పి ఎస్ రామకృష్ణ(ఆర్‌.కె)

సినిమా రంగంలో రాణించాంటే ప్యాషన్‌ ఉంటేనే సరిపోదు.. పక్కా ప్రణాళిక కూడా అవసరమే అంటున్నారు నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె).