పవర్ స్టార్ బాటలోనే సూపర్‌స్టార్.. సేమ్ సీక్రెట్...!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నడుస్తున్నారు. అభిమానులకు పోటీ పడి మరీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఒకే విషయాన్ని బయటకు రివీల్ కాకుండా దాచి ఉంచారని టాక్. ప్రస్తుతం ఒకరు ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తుండగా.. మరొకరు ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాలకు సంబంధించే ఓ సీక్రెట్‌ను ఆ ఇద్దరు హీరోలు మెయిన్‌టైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
పవన్ హీరోగా స్టార్ డైరెక్టర్లలో ఒక్కరైన క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుండటం విశేషం. మెగా సూర్యా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఒక వజ్రాల దొంగగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాస్తవానికి ఈ సినిమా తెలుగులో మాత్రమే రూపొందుతోందని అంతా భావించారు. కానీ ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని టాక్. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు, సినీప్రియుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
అయితే.. మహేష్ కూడా పవన్ బాటనే అనుసరిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా ‘సర్కారు వారి పాట’ చిత్రం రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను తెలుగు వరకే అనుకున్నప్పటికీ మహేశ్ కూడా స్టార్ హీరో పైగా ప్రపంచ వ్యాప్తంగా ఈయన వీరాభిమానులు ఉండటంతో దీన్ని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు.. పవన్ ‘హరిహర వీరమల్లు’ విషయంలో ఆ సినిమా యూనిట్ ఎంతో గోప్యంగా ఉంచి టీజర్ రిలీజ్ చేసినప్పుడు అసలు విషయం బయటపెట్టారో... అదే బాటలో నడుద్దామని.. మహేశ్ కూడా తమ సినిమా మేకర్స్‌కు తెలిపారట. దీనికి ఓకే చెప్పిన చిత్రబృందం త్వరలోనే ‘సర్కారు వారి పాట’ కు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com