ఎన్టీఆర్ బాటలో మహేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా.. ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి. అలాంటి విషయమే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో జరిగింది. కాస్త వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వరుస విజయాలలో ఉన్న ఎన్టీఆర్‌కు తన 24వ చిత్రం టెంపర్‌కు ముందు రెండు వరుస పరాజయాలు ఉన్నాయి. ఆ చిత్రాలే రామయ్యా వస్తావయ్యా, రభస. ఈ రెండు సినిమాలు తారక్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. అలాంటి సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన టెంపర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా.. తారక్‌కు నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది.
సరిగ్గా అదే సీన్.. ఇప్పుడు మహేష్ విషయంలోనూ పునరావృతం అయ్యింది. మహేష్ కథానాయకుడిగా నటించిన 24వ చిత్రం భరత్ అనే నేను మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే దీనికి ముందు అంటే 22, 23వ చిత్రాలు బ్రహ్మోత్సవం, స్పైడర్.. మహేష్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మొత్తానికి.. ఎన్టీఆర్, మహేష్ 22, 23, 24 చిత్రాల విషయంలో ఒకేలాంటి పరిస్థితి ఎదురైందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com