నెట్టింట వైరల్ అవుతోన్న మహేశ్ ఫిట్‌నెస్ వీడియో
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్‌స్టార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కోవిడ్ సమయంలోనూ తన ఫ్యామిలీతో ఉంటున్న ఫొటోలు, చిన్న వీడియోలు షేర్ చేశారు మహేశ్ అండ్ ఫ్యామిలీ. ఈ క్రమంలో మహేశ్ లేటెస్ట్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చి నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఇప్పుడు మహేశ్ అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో మహేశ్ ఫిట్‌నెస్ కోసం బ్యాక్ జంప్ ఎక్సర్‌సైజులు చేస్తున్నాడు. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సినిమాల విషయానికి వస్తే మహేశ్ ఇప్పుడు తన 27వ సినిమా సర్కారువారి పాటతో బిజీగా ఉన్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండియాలోని కొన్ని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విలన్‌ను హీరో ఇండియాకు రప్పించిన కథాంశంతో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి వరకు ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. తర్వాత యు.ఎస్‌కు వెళ్లి అక్కడ చిత్రీకరించాల్సిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సర్కారు వారిపాట రూపొందుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments