మహేష్ తొలిసారి చేస్తున్నాడు...
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రహ్మోత్సవం` చిత్రీకరణలో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ బ్రహ్మోత్సవం తర్వాత ఎ.ఆర్.మురగదాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియడం లేదు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ డ్యూయెల్ రోల్ చేయనున్నాడట. ఇప్పటి వరకు నాని చిత్రంలో మాత్రం చివరి ఐదు నిమిషాలు డబుల్ చేసిన మహేష్ ఈచిత్రంలో పూర్తిస్థాయి డబుల్ రోల్ చేయనుండటం అభిమానులకు సంతోషం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments