మహేశ్ 27 ‘సర్కారు వారి పాట’
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా టైటిల్ లోగోను సూపర్‌స్టార్ మహేశ్ తన ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ టైటిల్ లోగోను విడుదల చేయడంపై అభిమానులు, ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.
ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్‌గా, ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. అయితే కియార అద్వాని పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఈ సినిమాపై మహేశ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో హ్యాట్రిక్‌కు బ్లాక్‌బస్టర్ స్టార్ట్ అని మహేశ్ అంటూ టైటిల్ లోగోను విడుదల చేయడం ఆయన సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పవచ్చు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తర్వాత మహేశ్ చేస్తున్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments