దుబాయ్ లో మహేష్ మ్యూజిక్ సిట్టింగ్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, సూపర్‌డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. తెలుగు సినిమా రేంజ్‌ను పెంచేలా మహేష్‌ను దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో ప్రొట్రేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ చేయమనటువంటి విభిన్నమైన పాత్రలో మహేష్ కనపడనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్ చేస్తున్నారు. మహేష్,కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు మ్యూజికల్‌గా సెన్సేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అందుకనే శ్రీమంతుడు కంటే బెస్ట్ మ్యూజిక్‌ను దేవిశ్రీ అందిస్తున్నారు. అల్రెడి రెండు అద్భుతమైన ట్యూన్స్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను జరుపుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments