మ‌హేష్ సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ మారుతున్నాడా?

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'( విన‌ప‌డుతున్న పేరు). కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 27న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఇది సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ర‌వి.కె.ర‌విచంద్ర‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌. అయితే ఇప్పుడు సినిమాటోగ్రాఫ‌ర్ ర‌విచంద్ర‌న్ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయాడ‌ట‌.

సినిమా ఆల‌స్య‌మవ‌డ‌మే ఇందుకు కారణం. ఈయ‌న స్థానంలో జ‌న‌తాగ్యారేజ్ ఫేమ్ తిరుని రీప్లేస్ చేయ‌బోతున్నార‌ట‌.