థియేటర్ లో మహేష్ పోరాటాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం భరత్ అనే నేను`. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మహేష్ సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నటించనుండడం విశేషం. కైరా అద్వాని నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలో మహేష్, కొరటాల, దేవిశ్రీ కలయికలో వచ్చిన శ్రీమంతుడు` ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా...ప్రస్తుతం లింగంపల్లి సమీపంలోని ఒక థియేటర్‌లో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి రెండో వారంలో ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com