అడవిలో మహేశ్ ఫైట్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సినిమా ఇప్పుడు తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ప్రస్తుతం సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా అడవిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఈ సినిమా ఈ టీజర్‌ను నవంబర్ 23న విడుదల చేస్తారట. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలతో డిజిటల్, శాటిలైట్ హక్కులు బిజినెస్ పూర్తయ్యింది. హిందీలో మన సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓ మోస్తరు సినిమాలకు హిందీలో మంచి డిజిటల్ , శాటిలైట్ బిజినెస్ జరుగుతుంది.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తున్నారు. మహేశ్ ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాశ్‌రాజ్, రాజేంద్ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ౠమహర్షిౠ తర్వాత మహేశ్ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, దిల్‌రాజులతో పాటు మహేశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com