మహేష్ అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పదా...

  • IndiaGlitz, [Monday,May 29 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం 'స్పైడ‌ర్‌'. ఈ స్పై థ్రిల్ల‌ర్ విడుద‌ల విష‌యంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అభిమానుల‌కు క్లారిటీ ఇచ్చేశాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడు. అలాగే మే 31న అభిమానుల‌కు కానుక ఉంటుంద‌ని చెప్పాడు. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్ మే 31న విడుద‌ల కావ‌డం లేద‌ట‌. తెలుగు, త‌మిళంతో పాటు సినిమా హిందీలో కూడా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు బావిస్తుండ‌టంతో మురుగ‌దాస్ హిందీ టీజ‌ర్‌ను క‌ట్ చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ట దీంతో ఖంగు తిన‌డం మ‌హేష్ వంతైంది.
అయితే సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజున మ‌హేష్ మ‌హేష్ సెంటిమెంట్‌ను వ‌దులుకోకుండా ఓ మోష‌న్ పోస్ట‌ర్‌ను మాత్రం విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యంలో అభిమానులు మాత్రం మురుగ‌దాస్‌పై కాస్తా గుర్రుగానే ఉన్నార‌ట‌. టీజ‌ర్ క‌ట్ చేసేంత కంటెంట్ కూడా లేదా ఏం అని అనుకుంటున్నార‌ట‌.
ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య‌, త‌మిళ న‌టుడు, ప్రేమిస్తా ఫేమ్ భ‌ర‌త్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌దు నిర్మాత‌లుగా సినిమాను భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు.