వైసీపీలో చేరిన మహేశ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువవుతున్నాయి. ఏ నేత ఏ పార్టీలో ఉంటారో.. ఏ నటుడు సడన్‌గా కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు, నటీనటులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇక హీరోలను నడిపిన అభిమానుల సంఘం అధ్యక్షులు సైతం వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ అధ్యక్షుడు, జనసేన నేత రాఘవరావు.. ఆ పార్టీ విధి విధానాలు నచ్చక బయటికొచ్చి వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.
తాజాగా.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు సురేష్ వైసీపీలో చేరారు. శనివారం ఉదయం 500 మంది అభిమానులతో కలిసి సురేశ్.. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఆదాల, ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. చేరిక అనంతరం అభిమానులతో కలిసి ఆదాల, అనిల్ కలిసి అభిమాన సంఘం బైక్ ర్యాలీ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నేతలకు అభిమానులు గజమాలతో సత్కరించారు. ఎంపీ అభ్యర్థి ఆదాల మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా వందలాది మంది వైసీపీలో చేరుతున్నారని.. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు.
కాగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం మొత్తం టీడీపీతోనే ఉంది. ముఖ్యంగా కృష్ణా అల్లుడు, మహేశ్ బావ అయిన గల్లా జయదేవ్ టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆదిశేషగిరిరావు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్నుంచి మహేశ్ అభిమానులు వైసీపీతోనే ఉన్నారు. ఆదిశేషగిరిరావు పార్టీ మారిన తర్వాత కూడా పలువురు అభిమానులు తాము వైసీపీ వైపే ఉన్నామని.. అభిమానం, రాజకీయ వేర్వేరని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout