సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల సేవా కార్యక్రమాలు
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణ జిల్లా కృష్ణ లంక నల్లగేట్ కృష్ణ టీ స్టాల్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమాని లొల్ల కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో అవసరమైన 50మంది కి కళ్ళ జోళ్లను పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మాతృమూర్తి సరోజినీ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎదుటివారికి తమ వంతు సహాయం అందించటం మంచి లక్షణం అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సత్ప్రవర్తనతో విద్యనభ్యసించాలని కోరారు.
రేపల్లె త్రిబుల్ సూపర్ స్టార్స్ కృష్ణ రమేష్ మహేష్ యువత గుమ్మడి రవి కృష్ణ ఆధ్వర్యంలో నటుడు,నిర్మాత,రైసింగ్ స్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి రామకృష్ణ( బాబీ ) తో పాటు , ఫణి బొబ్బ , సందీప్ పాములపాటి, దామర్ల సుబ్బారావు, ఈ వెంకటేశ్వర్లు, సయ్యద్ శావుల్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు
హైదరాబాద్ అల్వాల్ లోని సెయింట్ మారిటియన్స్ వృద్ద ఆశ్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నిర్మల్ అధ్యక్షుడు గంగాధర్ మూట అధ్యర్యంలో నటుడు ,నిర్మాత,రైసింగ్ స్టార్ ఘట్టమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్దుల సమక్షంలో కేక్ కట్ చేసి వృద్దులకు దుస్తులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మనం సేవా సంస్థ ఫౌండర్ మనం శశి , హరికృష్ణ కనమర్లపూడి మాట్లాడుతూ కట్టుకోడానికి సరైన దుస్తులు లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు ఈ విధంగా సహాయం అందిచటం సంతోషముగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు
తెనాలి బీసీ కాలనిలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన , కళాజ్యోతి రమేష్ బాబు యువ సేన ఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నటుడు నిర్మాత రైసింగ్ స్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సయ్యేదా షావుల్ తో పాటు గుమ్మడి రామ కృష్ణ , సందీప్ పాములపాటి, దామర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments