బ్రహ్మోత్సవం - ప్లాపోత్సవం ఆర్టికల్ పై అభ్యంతరం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం బ్రహ్మోత్సవం. ఇటీవల రిలీజైన బ్రహ్మోత్సవం చిత్రం గురించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో దురాభిమానులు దుష్ర్పచారం చేస్తున్నారు. అయితే...దురాభిమానులు చేసే దుష్ర్పచారాన్నితెలియచేస్తూ... ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ బ్రహ్మోత్సవం - ప్లాపోత్సవం అంటూ ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ రోజు ప్రచురించిన బ్రహ్మోత్సవం ఫ్లాపోత్సవం ఆర్టికల్ పై మహేష్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దిడ్డి రాంబాబు, ఖాదర్ ఘోరి తదితరులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ యాజమాన్యంతో ఈ విషయం పై చర్చలు జరిపారు. అనంతరం మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ...మా అభిమాన హీరో మహేష్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి పై ఇలాంటి వార్తలు ప్రచురించడం బాధాకరం. మేము ఏమైతే అభ్యంతరం వ్యక్తం చేసామో...వాటిని ఇండియన్ ఎక్స్ ప్రెస్ యాజమాన్యం గుర్తించి రేపు బ్రహ్మోత్సవం పై మరో ఆర్టికల్ రాసేందుకు అంగీకరించింది. అలాగే భవిష్యత్ లో ఇలాంటివి మళ్లీ జరగకుండా చూస్తాం అని హామీ ఇచ్చారు. అందుచేత దయచేసి అభిమానులు ఎవరూ బాధపడద్దు అని తెలియచేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments