Mahesh Babu:మహేష్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ అప్టేడ్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ యూనిట్ అప్టేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని 'దమ్ మసాలా' సాంగ్ ప్రోమోను రేపు (ఆదివారం) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. దీంతో మహేష్‌ అభిమానుల్లో జోష్ నెలకొంది. పూర్తి పాటను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. రేపు విడుదల కానున్న సాంగ్ ప్రోమోలో ఈ మేరకు వెల్లడించనున్నారు.

ఇక శుక్రవారం రాత్రి నుంచి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాట లీకైందని సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ తెగ వైరల్ అయింది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగిన ఈ క్లిప్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. అయితే కొంతమంది మాత్రం ఈ పాట సంగీత దర్శకుడు థమన్ గత చిత్రాల్లోని పాటల మాదిరిగానే ఉందని ట్రోల్ చేస్తున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఇంతవరకు ఈ పాట లీక్‌పై స్పందించలేదు. కానీ ఇప్పుడు 'దమ్ మసాలా' అంటూ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

ఇక ఈ మూవీ విషయానికొస్తే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ లీడ్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా ఇందులో నటిస్తున్నారు. మూవీలో మహేష్ బాబును గతంలో ఎప్పుడూ చూడని విధంగా మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపించున్నారని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న మూవీ విడుదల కానుంది.

More News

Pawan Kalyan:చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్‌.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు.

Kishan Reddy:కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి: కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అందకారంలో పడిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.

CM KCR:కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు.

Small Parties:పోటీకి దూరంగా చిన్న పార్టీలు.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్‌..?

తెలంగాణ ఎన్నికల్లో రోజురోజుకు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా చిన్న పార్టీలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయి.

Wines Bandh :మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజలు వైన్స్ బంద్..

తెలంగాణలో మందుబాబులకు కేంద్రం ఎన్నికల సంఘం బ్యాడ్ న్యూస్ అందించింది. నవంబర్ 30న పోలింగ్ సందర్భంగా