ప్యాన్ ఇండియా సినిమాపై మహేశ్ కన్ను
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్.. ఈ హీరో పేరు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సుపరిచితమే. అయితే ఈయన మార్కెట్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్‌సీస్‌కే పరిమితం అయ్యింది. భారీ సినిమాలు చేయడానికి మహేశ్ కాస్త వెనకా, ముందు ఆలోచిస్తున్నాడు. ఆ మధ్య ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదలైంది. ఆ సినిమా ప్లాప్ కావడంతో మహేశ్ ఢీలా పడ్డాడు.
అయితే ఆలోపు ప్రభాస్ `బాహుబలి` సక్సెస్‌తో నేషనల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. సాహోతోనూ ప్రభాస్ తన హిందీ మార్కెట్‌ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు రామ్‌చరణ్, ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్`తో నేషనల్ రేంజ్‌లో మార్కెట్‌ను పెంచుకుంటారనడంలో సందేహం లేదు. ఇప్పుడు మహేశ్ అలాంటి ఓ భారీ సినిమాను చేయాలనుకుంటున్నాడట. అందులో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చర్చలు జరుపుతున్నాడని సమాచారం. డిసెంబర్లో ప్రశాంత్ మహేశ్‌కి ఓ స్క్రిప్ట్‌ను వినిపిస్తాడట. దీంతో మహేశ్ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తాడనేది సమాచారం.
ప్రస్తుతం మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com