ఈ సంక్రాంతి ఆ లెక్కన మహేష్ కి ఓకే..

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి సంక్రాంతి అచ్చొచ్చిన సీజ‌న్‌. ఆ పండ‌గ స‌మ‌యంలో రిలీజైన చాలా చిత్రాలు కృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌, అమ్మ‌దొంగా వంటి ఘ‌న‌విజ‌యాలు సొంత‌మైంది కూడా ఆ పండ‌గ స‌మ‌యంలోనే. అలా తండ్రికి క‌లిసొచ్చిన సంక్రాంతికి అప్పుడ‌ప్పుడు త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాడు మ‌హేష్‌. వాటిలో ఒక్క‌డు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి విజ‌యాలుండ‌గా.. ట‌క్క‌రి దొంగ‌, 1-నేనొక్క‌డినే లాంటి ప్ర‌యోగాలూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. వ‌చ్చే సంక్రాంతికి కూడా మ‌హేష్ సంద‌డి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న భ‌ర‌త్ అనే నేనుని జ‌న‌వ‌రి 11నే విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారమ్‌. సంక్రాంతికి రిలీజైన గ‌త చిత్రం 1-నేనొక్క‌డినే స‌క్సెస్ అయిపోయినా.. ఆ సీజ‌న్‌లో విడుద‌లై మంచి హిట్ అయిన సీత‌మ్మ‌.. రిలీజ్ రోజునే భ‌ర‌త్ అనే నేను ని తీసుకురావ‌డం చూస్తే ఆ సెంటిమెంట్ మ‌హేష్‌కి మ‌రోసారి క‌లిసొచ్చేలాగే ఉంది.