కొత్త వ్యాపారంలోకి మ‌హేశ్‌

  • IndiaGlitz, [Monday,March 09 2020]

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్ కాల్షీట్స్ చాలా క్లాస్టీ. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోల్లో ముందు వ‌రుస‌లో ఉండే మ‌హేశ్ కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కావ‌డం లేదు. సినిమాల‌కు స‌మాంతరంగా ఆయ‌న కొత్త వ్యాపారాల్లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే.

నిర్మాత‌గా...
సినిమాల్లో హీరోగా న‌టించ‌డ‌మే కాదు, నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టారు మ‌హేశ్‌. జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసిన మ‌హేశ్ నిర్మాణంలో భాగంగా మ‌హ‌ర్షి సినిమాలో పార్ట్‌న‌ర్ అయ్యారు. అలాగే మేజ‌ర్ సినిమాను అడివిశేష్‌తో నిర్మిస్తున్నారు.

మ‌ల్టీప్లెక్స్‌, దుస్తులు...
ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి ఏఏంబీ సినిమాస్ అనే మ‌ల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మ‌ల్టీప్లెక్స్‌ల‌ను మ‌రిన్ని న‌గ‌రాల‌కు విస్త‌రింప చేసే ప‌నిలో ఉన్నారు. అలాగే హంబుల్ అనే దుస్తులు బిజినెస్‌లోనూ ఆయ‌న భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కొత్త వ్యాపారం..
ఇలా సినిమాల్లో హీరోగా, నిర్మాత‌గా ఉంటున్న మ‌హేశ్ 22 బ్రాండ్స్‌కు అంబాసిడ‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తాజాగా మ‌హేశ్ మ‌రో వ్యాపారంలోకి అడుగు పెట్ట‌బోతున్నాడ‌ట‌. అదేదో కాదు.. పెర్ఫ్యూమ్ కంపెనీని స్టార్ట్ చేసే ఆలోచన‌లో ఉన్నాడని త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.