నానితో మహేష్ డైరెక్టర్?
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యువ కథానాయకుడు.. నాని. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న కృష్ణార్జున యుద్ధం`లో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. నాగార్జునతోనూ ఓ మల్టీస్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ యువ కథానాయకుడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ.. కెరీర్‌ను చాలా చక్కగా మలుచుకుంటున్నారు ఈ నేచురల్ స్టార్. ఇదిలా వుంటే.. త్వరలో ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తోనూ నాని సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. సామాజిక స్పృహతో కూడిన సినిమాలను తెరకెక్కించే కొరటాల శివ దర్శకత్వంలో.. నాని త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల భరత్ అనే నేను` మూవీతో బిజీగా ఉన్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత తన తదుపరి సినిమాని.. నాని కాంబినేషన్లో చేసేందుకు కొరటాల ప్లాన్ చేశారని సమాచారం. ఈ సినిమాని కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com