మహేష్ విలన్ అడగకుండానే చేశాడంట

  • IndiaGlitz, [Thursday,September 21 2017]

భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 27న రానుంది మ‌హేష్ బాబు కొత్త చిత్రం స్పైడ‌ర్‌. తెలుగు, త‌మిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా సింగిల్ క‌ట్ కూడా లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్ పాత్ర‌లో న‌టించాడు.

ఈ సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ.. స్పైడ‌ర్ మంచి స‌బ్జెక్ట్‌. మురుగ‌దాస్ ఈ క‌థ చెప్ప‌గానే, న‌చ్చేసి వెంట‌నే సంత‌కం చేసేశా. హీరోగా ఎవ‌రు న‌టిస్తున్నారు అనే విష‌యాన్ని కూడా అడ‌గ‌బుద్ధి కాలేదంటే.. ఎంత న‌చ్చిందో మీరు అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ త‌రువాతే ఇందులో మ‌హేష్ న‌టిస్తున్నాడ‌ని, ఇదో ద్విభాషా చిత్ర‌మ‌ని తెలిసింద‌ట సూర్య‌కి. మ‌హేష్ నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని చెప్పుకొచ్చాడాయ‌న‌. గ‌తంలో ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో నాని అనే సినిమాలో మ‌హేష్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

More News

'సైరా' షూటింగ్ కి సిద్ధమౌతున్నాడు

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి.

తాత క్యారెక్ట‌ర్ చేయ‌డం లేద‌ట‌

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌లో కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తోంది.

ఎన్టీఆర్.. పాత్ర‌ల‌కే కాకుండా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం జైల‌వ‌కుశ.  ఈ సినిమాలో జై, ల‌వ‌కుమార్‌, కుశ అనే మూడు పాత్ర‌లు పోషించాడు తార‌క్‌.

సాయిప‌ల్ల‌వి అక్క‌డ కూడా..

ఫిదా చిత్రంతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి సాయి పల్ల‌వి. అంత‌కుముందు ప్రేమ‌మ్‌, క‌లి అనే మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించిన‌ సాయిప‌ల్ల‌వికి ఫిదాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది.

శ్రీవల్లి విజయం మాలో ధైర్యాన్ని నింపింది : నిర్మాతలు

ఈ రోజుల్లో కొత్తనటీనటులతో సినిమా తీసి విడుదల చేయడమే నా దృష్టిలో అతిపెద్ద యజ్ఞం.