మహేష్ విలన్ అడగకుండానే చేశాడంట
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ అంచనాల మధ్య ఈ నెల 27న రానుంది మహేష్ బాబు కొత్త చిత్రం స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సింగిల్ కట్ కూడా లేకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటించాడు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. స్పైడర్ మంచి సబ్జెక్ట్. మురుగదాస్ ఈ కథ చెప్పగానే, నచ్చేసి వెంటనే సంతకం చేసేశా. హీరోగా ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని కూడా అడగబుద్ధి కాలేదంటే.. ఎంత నచ్చిందో మీరు అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాతే ఇందులో మహేష్ నటిస్తున్నాడని, ఇదో ద్విభాషా చిత్రమని తెలిసిందట సూర్యకి. మహేష్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడాయన. గతంలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమాలో మహేష్ నటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com