ఎడారిలో మహేష్‌ కుమార్తె సితార

  • IndiaGlitz, [Sunday,February 07 2021]

ఎడారిలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార ఎంజాయ్‌ చేసింది. ఒంటెలు, బైకులు, డన్‌ బగ్గీస్‌లో షికార్లు చేసింది. ప్రజెంట్‌ మహేష్‌ బాబు దుబాయ్‌లో ఉన్నాడు. పరశురామ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ చేస్తున్నాడు. మహేష్‌తో పాటు ఫ్యామిలీ కూడా దుబాయ్‌ వెళ్లింది. ఫారిన్‌లో షూటింగ్స్‌ చేస్తే ఫ్యామిలీని తీసుకువెళ్లడం మహేష్‌కి అలవాటే. ఈసారి కూడా తీసుకువెళ్లాడు. దుబాయ్ ఎడారి దేశం కదా! అక్కడ హ్యాపీగా సితార డిజర్ట్ సఫారీ ఎంజాయ్ చేసింది. తాను ఎడారికి వెళ్లడం తొలిసారి అని సితార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనలోనూ ఒక రేసర్ ఉందని పేర్కొంది. ఏఎడారిలో ఇసుక కొండల్లో బగ్గీస్ లో వెళ్లడం మంచి అనుభూతి ఇచ్చిందట. సితారతో పాటు నమ్రత కూడా ఎంజాయ్ చేశారు. కూతురిఎక్కించుకుని స్పోర్ట్ బగ్గీ డ్రైవ్ చేశారు. నమ్రతకు సితార కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చింది. 'మా అమ్మ బెస్ట్ డ్రైవర్' అని చెప్పింది.