కౌశ‌ల్‌కు మ‌హేశ్ అభినంద‌న‌...

  • IndiaGlitz, [Wednesday,October 03 2018]

బిగ్‌బాస్ సీజ‌న్ 2లో కౌశ‌ల్ విజేత‌గా నిలిచాడు. బిగ్‌బాస్ స్టార్ట‌యిన కొన్ని రోజుల‌కే.. చాలా ఉత్కంఠ‌తో న‌డిచింది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చాలా ఆస‌క్తిరేగింది. అయితే కౌశ‌ల్ ప్ర‌వ‌ర్త‌న‌.. సోష‌ల్ మీడియాలో కౌశ‌ల్ ఆర్మీ చేసిన స‌పోర్ట్ అంతా వెర‌సి త‌న‌ను విజేత‌గా నిలబెట్టాయి. కౌశ‌ల్‌కు ఇప్పుడు చాలా మంది ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు చెబుతున్నారు.

రీసెంట్‌గా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేశ్‌బాబు కౌశ‌ల్‌కు అభినందిస్తూ మెసేజ్ పోస్ట్ చేశాడు. నిజానికి కౌశ‌ల్‌కు మ‌హేశ్ అభిమాన హీరో. కెరీర్ ప్రారంభంలో మోడ‌ల్ ఏజెన్సీ పెట్ట‌మ‌ని కౌశ‌ల్‌ను మ‌హేశ్ ఎంక‌రేజ్ కూడా చేశాడ‌ట‌. ఇప్పుడు మ‌రోసారి కౌశ‌ల్‌కు కంగ్రాట్స్ చెప్పాడు మ‌హేశ్‌.