మహేష్ సినిమాలను కన్ ఫర్మ్ చేశాడు...
- IndiaGlitz, [Sunday,January 01 2017]
ప్రస్తుతం సూపర్‌స్టార్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో సంభవామి(వినపడుతున్న పేరు) అనే సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్గా అహ్మదాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. జనవరి 7 నుండి తదుపరి షెడ్యూల్ కోసం మహేష్ సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జ్యూరిచ్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న మహేష్ తన తదుపరి సినిమాల గురించిన క్లారిటీని ఇచ్చేశాడు.
సంభవామి మహేష్ 23వ సినిమా అయితే, కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ తన 24వ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. మహేష్ తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాను అశ్వనీదత్, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మహేష్ తన 26వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.