‘మహర్షి’తో మహేష్ కాలర్ ఎగరేసి.. అంకితం!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో చెప్పారు. అంతేకాదు.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పినట్లుగానే మహేష్, క్రిష్ణ అభిమానులే కాదు.. మహర్షి కూడా కాలర్ ఎగరేశాడు. సూపర్‌స్టార్ ఇలా కాలర్ ఎగరేయడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
మదర్స్ డే సందర్భంగా.. అమ్మలందరికీ అంకితం..
మే-12 మదర్స్ డే అనే విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఈ రోజే ‘మహర్షి’ చిత్రబృందం సక్సెస్ పెట్టింది. ఈ సందర్భంగా మహేశ్ ‘అమ్మ’ గురించి మాట్లాడుతూ.. "మదర్స్ డే.. అమ్మంటే దేవుడితో సమానం. ప్రతిసారి అమ్మ దగ్గరికెళ్లి కాఫీ తాగుతాను.. అలా తాగితే నాకు దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ సక్సెస్‌ను అమ్మలందరికీ అంకితం చేస్తున్నాను" అని మహేశ్ చెప్పుకొచ్చారు.
దిల్‌రాజు సిక్స్ కొట్టారు...
"నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లాను. చివర్లో దోని సిక్స్ కొట్టినప్పుడు చాలా సంతోషపడ్డా. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌రాజుగారు సిక్సర్ కొట్టాం అనగానే అంతే ఆనందం వేసింది. మూడు పెద్ద బ్యానర్స్‌లో నా సినిమా రావడం గర్వంగా ఉంది. సాధారణంగా అశ్వనీదత్ గారు.. నన్ను ప్రిన్స్, బాబు అని పిలుస్తుంటారు. నా సినిమా ఆయనకు విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తుంటారు. అలా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటాను. ‘మహర్షి’ సినిమా చూసిన తర్వాత మహేష్ అని పిలిచారు. మహేష్.. నువ్వు సమ్‌థింగ్ ఎల్స్.. ఈ సినిమా కూడా సమ్‌థింగ్ ఎల్స్ అన్నారు" అని మహేష్ మురిసిపోయారు!
వన్ వీక్‌లో దాటేయబోతున్నాం..
"నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వన్ వీక్‌లో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు ఇంకోటి లేదు. ఆడియన్స్, నా అభిమానులకు హ్యాట్సాఫ్. ముందుగా నరేష్‌గారికి థాంక్స్.. ఎందుకంటే, ఆయన ఈ క్యారెక్టర్‌ను చేస్తాడా? అనుకున్నాను. కానీ.. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. వంశీ గురించి చాలా విషయాలే చెప్పాను. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా కాలర్ ఎత్తుకుంటున్నాను" అని మహేష్ చెప్పారు. సో.. మొత్తానికి చూస్తే ముందుగా చెప్పినట్లుగానే.. ‘మహర్షి’తో మహేష్ కాలర్ ఎగరేశాడుగా..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments