నెక్స్ట్ సినిమా ఆయనతోనే.. క్లారిటీ ఇచ్చేసిన మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ఎల్లుండి అనగా.. జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్లో భాగంగా సరిలేరు ఇంటర్వ్యూలో గురించి పలు ఆసక్తికర విషయాలను మహేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో తన తదుపరి సినిమా ఎవరితో అనే విషయంపై సూపర్‌స్టార్ క్లారిటీ ఇచ్చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా మీ తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన మహేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు గారితో సినిమా ఉంటుందని చెప్పారు. వంశీ చెప్పిన స్క్రిప్ట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అన్పించిందని మొత్తం కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘మహర్షి’ సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అంటే మరోసారి ఈ కాంబోలో వస్తున్న కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో ఏంటో..! కాగా.. సరిలేరు తర్వాత గీతగోవిందం డైరెక్టర్ పరుశురాం, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లైన్లో ఉన్నారు. అయితే వారందరికీ షాకిచ్చినట్లు మాట్లాడుతూ తన తదుపరి సినిమా వంశీతో అని తేల్చేశారు.. మహేశ్. మరి ఆ డైరెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com