యాక్షన్ సీన్స్ లో మహేష్ బిజీ..!
Monday, October 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తెలుగు, తమిళ్ లో ఈ భారీ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
ఈ మూవీ కోసం మహేష్ పై కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీన్స్ ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో షూట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండడం విశేషం. సండే కూడా సెలవు తీసుకోకుండా మహేష్ బాబు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను డిసెంబర్ కి పూర్తి చేసేలా ప్లాన్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments