ఇంట్రస్టింగ్ గా.. మహేష్ న్యూ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. పి.వి.పి సంస్థ తెలుగు - తమిళ్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. తాజాగా మే 7న ఆడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో డిఫరెంట్ గా డెకెరేట్ చేసిన మూడు చక్రాల వాహనం పై మహేష్ బుల్లెట్ లా దూసుకెళుతున్నట్టుగా చూపించారు. డిఫరెంట్ గా ఉన్నఈ మోషన్ పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉండి బ్రహ్మోత్సవం పై మరింత ఆసక్తిని పెంచుతుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన బ్రహ్మోత్సవం ఆడియోను మే 7న, చిత్రాన్ని మే 20న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments