మహేష్ వస్తాడా? వదులుకుంటాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
'శ్రీమంతుడు' వంటి సంచలన విజయం తరువాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి సందర్భంలో.. మహేష్ కథానాయకుడుగా సినిమా వచ్చి ఈ సంవత్సరంతో పదేళ్లు పూర్తవుతున్నాయి.
సరిగ్గా పదేళ్ల క్రితం మహేష్ నుంచి వచ్చిన సమ్మర్ స్పెషల్ సినిమా 'పోకిరి'. పాత రికార్డులన్నింటిని భూస్థాపితం చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందా చిత్రం. అంత బాగా కలిసొచ్చిన సమ్మర్ సీజన్‌లో మళ్లీ మహేష్ సినిమా రావడం 'బ్రహ్మోత్సవం' విషయంలోనే జరుగనుంది. అన్నీ అనుకున్నట్లే జరిగి సమ్మర్‌కే 'బ్రహ్మోత్సవం' విడుదలైతే.. పదేళ్ల క్రితం నాటి 'పోకిరి' మ్యాజిక్‌ని మహేష్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
'బ్రహ్మోత్సవం' మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్ సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com