భారీ సెట్‌లో మహేష్ బాబు ఆటాపాటా
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటని ఈ నెల 17 నుంచి భారీ సెట్‌లో చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
మహేష్ బాబు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఆమని, సితార ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 'శ్రీమంతుడు' వంటి విజయవంతమైన చిత్రం తరువాత మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com